Zaira Wasim: దంగల్ ఫేమ్ జైరా వాసిం పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించింది. సోషల్ మీడియాలో నిఖా ఫోటోలు షేర్ చేసింది. సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఈ నటి ఇప్పుడు వివాహ బంధంలో సంతోషంగా ఉంది.
జైరా వాసిం, దంగల్ సినిమాతో 16 ఏళ్ల వయసులో స్టార్‌డమ్ సాధించింది. ఆమిర్ ఖాన్ సరసన గీతా ఫొగట్ పాత్రలో నటించి మెప్పించింది. జాతీయ అవార్డు సైతం అందుకుంది. దంగల్ తరువాత సీక్రెట్ సూపర్‌స్టార్, ద స్కై ఈజ్ పింక్ చిత్రాలతో గుర్తింపు పొందింది. అయితే 2019లో తన మత విశ్వాసాలకు కట్టుబడి సినిమా ఇండస్ట్రీని వీడింది. గ్లామర్ ప్రపంచం తనకు సరిపోదని, సోషల్ మీడియాలో తన ఫోటోలు తొలగించాలని అభిమానులను కోరింది. తాజాగా జైరా వివాహంతో కొత్త జీవితం మొదలుపెట్టింది. తన నిఖా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. భర్తతో నెలవంక చూస్తూ ఉన్న ఫోటో వైరల్‌గా మారింది. ఇందులో తన ముఖం దాచినప్పటికీ, అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తారు. జైరా ఈ కొత్త అధ్యాయంలో సంతోషంగా ఉందని నెటిజన్లు ఆశిస్తున్నారు. ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ వివాహం సినీ అభిమానుల మధ్య చర్చనీయాంశమైంది.
— Zaira Wasim (@ZairaWasimmm) October 17, 2025