Athirathi: మలయాళ సినిమా ప్రేమికులకు గుడ్ న్యూస్! టొవినో థామస్, బేసిల్ జోసెఫ్ కలిసి ‘అతిరథి’తో మాస్ మాయాజాలం సృష్టించబోతున్నారు. టైటిల్ టీజర్ విడుదలైంది. ఈ సినిమా యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్‌తో అదిరిపోనుంది. అరుణ్ అనిరుధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.
Also Read: Jugari Cross: కన్నడ క్లాసిక్ నవల ‘జుగారి క్రాస్’ సినిమాగా.!
‘అతిరథి’ సినిమా టైటిల్ టీజర్ మలయాళ సినీ అభిమానుల్లో సందడి చేస్తోంది. టొవినో థామస్, బేసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం ప్యూర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. అరుణ్ అనిరుధన్ దర్శకత్వంలో బేసిల్ జోసెఫ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, డాక్టర్ అనంత్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. టీజర్‌లో అడవిలో మంటల్లా హీరోలను చూపిస్తూ వినీత్ శ్రీనివాసన్ డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పించాయి. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి. గతంలో టొవినో, బేసిల్ కలిసి చేసిన చిత్రాలు హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ కలగలిపిన ఈ మాస్ ట్రాక్‌పై అంచనాలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుందని సంకేతమిస్తోంది.