PM Modi

PM Modi: భారత్ ఇక అన్‌స్టాపబుల్ .. ప్రధాని మోదీ కీలక కామెంట్స్

PM Modi: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ సంఘర్షణలు వంటి ‘స్పీడ్‌బ్రేకర్ల’తో సతమతమవుతున్నప్పటికీ, భారత్ మాత్రం ఆగదనీ, వెనక్కి తగ్గదనీ, ‘అన్‌స్టాపబుల్’ వేగంతో ముందుకు సాగుతోందనీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ 2025 ను ఉద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేశారు. “రిస్క్, రిజాల్వ్, రెన్యూవల్” అనే ఈ సమ్మిట్ థీమ్‌ను ప్రస్తావిస్తూ, “అన్‌స్టాపబుల్ భారత్” అనే అంశం ప్రస్తుత పరిస్థితులకు చాలా సముచితమైనదనీ, 140 కోట్ల మంది భారతీయులు పూర్తి వేగంతో ముందుకు సాగుతారని ఆయన ఉద్ఘాటించారు. ఒకప్పుడు అంతర్జాతీయ సంస్థలు భారత్‌ను ఫ్రజైల్ ఫైవ్ దేశాల్లో చేర్చాయనీ, విధానపరమైన పక్షవాతంరాజ్యమేలిందనీ, పెద్దపెద్ద కుంభకోణాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయనీ ప్రధాని పరోక్షంగా గత ప్రభుత్వాలను విమర్శించారు. నేడు భారత్ ‘ఫ్రజైల్ ఫైవ్ నుంచి బయటపడి ప్రపంచంలో టాప్ 5 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది.

Also Read: AP Govt Employees: ఏపీలో ఉద్యోగులకు కూటమి సర్కార్ దీపావళి గుడ్ న్యూస్!

గత మూడు సంవత్సరాలలో, ప్రపంచ సంక్షోభాలు ఉన్నప్పటికీ, భారత్ సగటున 7.8% వృద్ధి రేటును సాధించింది. ప్రస్తుతం వృద్ధి రేటు 7% కంటే ఎక్కువగా, ద్రవ్యోల్బణం 2% కంటే తక్కువగా ఉందని తెలిపారు. ప్రపంచం ఇప్పుడు భారత్‌ను “విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన మరియు స్థితిస్థాపకత కలిగిన భాగస్వామిగా చూస్తోంది. యూరోపియన్ దేశాల కూటమి అయిన EFTA తో కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల భారత్‌లో $100 బిలియన్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, ఇది పెద్ద ఎత్తున ఉద్యోగాలను సృష్టిస్తుందని వెల్లడించారు. G7 దేశాలతో భారతదేశ వాణిజ్యం 60% కంటే ఎక్కువగా పెరిగిందని తెలిపారు. 17 ఏళ్ల తర్వాత భారత్ క్రెడిట్ రేటింగ్‌ను ఎస్&పీ గ్లోబల్ అప్‌గ్రేడ్ చేయడం దేశంపై అంతర్జాతీయ విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. కొత్త భారతం ఉగ్రవాద దాడులను మౌనంగా భరించదని ప్రధాని గట్టిగా హెచ్చరించారు. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ మరియు ఆపరేషన్ సింధూర్ వంటి నిర్ణయాత్మక చర్యల ద్వారా భారత్ గట్టిగా, దృఢంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు. మావోయిస్ట్ ఉగ్రవాదం నుండి దేశానికి త్వరలోనే విముక్తి లభిస్తుందనే హామీని ఇచ్చారు. గత 75 గంటల్లోనే 303 మంది మావోయిస్టులు లొంగిపోవడం తన జీవితంలో ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు. వీరు తుపాకులు, బాంబులు విడిచి భారత రాజ్యాంగాన్ని స్వీకరించడానికి సిద్ధపడ్డారని ప్రశంసించారు. ఒకప్పుడు 125 జిల్లాల్లో మావోయిస్ట్ ప్రభావం ఉండేదనీ, ఇప్పుడు అది కేవలం 11 జిల్లాలకే పరిమితమైందనీ తెలిపారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *