RGV

RGV: దర్శకుడు ఆర్‌జీవీపై కేసు నమోదు!

RGV: ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్‌జీవీ), సీనియర్ యాంకర్ స్వప్నలపై రాజమండ్రిలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ద్వేషపూరిత ప్రసంగాలు చేసి, హిందూ మత మనోభావాలను దెబ్బతీశారంటూ వీరిపై ఫిర్యాదు దాఖలైంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది మేడా శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్‌జీవీ, యాంకర్ స్వప్న సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, యూట్యూబ్లలో పోస్ట్ చేసిన కొన్ని వ్యాఖ్యలు, వీడియోలు హిందూ దేవుళ్లను అవమానించేలా, పవిత్ర గ్రంథాలైన రామాయణం, మహాభారతాలను అపహాస్యం చేసేలా ఉన్నాయని మేడా శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలు కేవలం మత మనోభావాలను దెబ్బతీయడమే కాక, సామాజిక, జాతీయ సమగ్రతకు ముప్పు కలిగించే విధంగా ఉన్నాయని ఫిర్యాది ఆరోపించారు.మేడా శ్రీనివాస్ తమ పార్టీ కార్యకర్తలతో కలిసి త్రీ టౌన్ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదును, దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఆధారాలను కూడా సమర్పించారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కేసు నమోదుతో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో కూడా ఆయన పలు రాజకీయ నాయకులు, ప్రముఖులపై చేసిన వ్యాఖ్యల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో కేసులు నమోదైన విషయం తెలిసిందే.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *