Telangana: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం (అక్టోబర్ 17) నుంచి ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నది. ఈ మేరకు మక్తల్ లో మంత్రులు వాకిటి శ్రీహరి, దామోదర రాజనర్సింహ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మిగతా అన్ని జిల్లాల్లో మంత్రులు, అక్కడి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
Telangana: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది రూ.123 కోట్ల వ్యయంతో 88 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. దీనిలో భాగంగానే 10 కోట్ల రొయ్య పిల్లలనూ పంపిణీ చేయనున్నది. ఈ మేరకు రాష్ట్రంలోని 32 జిల్లాల్లోని 46వేలకు పైగా చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేపపిల్లలను పెంచేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.