RS Praveen Kumar: తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కుక్కులు చింపిన విస్తరులా తయారైంది.. మంత్రుల స్థానాల్లో మాఫియా డాన్‌లు కూర్చున్నారు.. అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన ఆరోపణలు గుప్పించారు. ప్రజలు ఓటేస్తె మంత్రులై, వారి దుకాణాలు ఓపెన్ చేసుకొని, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఎప్పుడూ, ఎవరూ అనుకోలేదని ఆందోళన వ్యక్తంచేశారు.
RS Praveen Kumar: మంత్రి కొండా సురేఖ కూతరు సుస్మిత నిజం చెప్పారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సుస్మిత ఆరోపించినట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిణ్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాల్ డీటెయిల్స్ తీయాలని బయటకు తీయాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్‌లో అధికారికంగా జరగాల్సిన పనులు రోహిణ్‌రెడ్డి గెస్ట్‌హౌజ్‌లో ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు.
RS Praveen Kumar: వాళ్లందరి కాల్ డీటెయిల్స్ బయటకు తీస్తే ఈ దొంగల ముఠా గూడుపుఠాని బయట పడుతుందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సుమంత్ అనే వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని పోలీసులను ప్రశ్నించారు. అసలు రోహిణ్‌రెడ్డికి, సుమంత్‌కు ఉన్న సంబంధం ఏమిటని నిలదీశారు. తలల మీద పిస్టల్ పెట్టి పంచాయితీలు చేసుడు ఏమిటి? ఒక పౌరుడి చేతుల్లోకి పిస్టల్ ఎలా వచ్చింది? అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు.
RS Praveen Kumar: సామాన్యులకు ఒక న్యాయం? మంత్రులకు ఒక న్యాయమా? అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. మంత్రి మనిషి గన్‌తో బెదిరిస్తే కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని, నిందితులను ఎందకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేస్తే వెంటనే అరెస్టు చేస్తున్నారు, ఇలాంటి విషయాల్లో ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
RS Praveen Kumar: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్‌కు నడిచి వస్తే కేసు పెట్టారు.. మన్నె క్రిశాంక్ ట్వీట్ చేస్తే 10 కేసులు పెట్టారు.. అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అసలు ఇది ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన అని వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు పెడితే అరెస్టు చేశారని గుర్తుచేశారు. అలాంటిది మంత్రి మనిషి ఒక సిమెం్ కంపెనీ యాజమాన్యాన్ని గన్‌తో బెదిరిస్తే ఇప్పటి వరకూ అతనిపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు.

