Konda Surekha: తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పరిణామాలు ఉత్కంఠకు దారితీస్తున్నాయి. దేవాదాయ శాఖ ఓఎస్డీ సుమంత్‌ను తొలగించినప్పటి నుంచి పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిన్న (అక్టోబర్ 15) హైదరాబాద్‌లోని కొండా సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు సుమంత్ కోసం వచ్చినట్టు తెలిసింది.
Konda Surekha: ఈ సమయంలో మంత్రి సురేఖ, ఆమె కూతురు సుస్మిత పోలీసులతో వాగ్వాదానికి దిగడం, మీడియాతో సుస్మిత చేసిన తీవ్ర వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర కీలక మంత్రులు, నేతలపై ఆరోపణలు చేయడంతో అది తీవ్రస్థాయికి చేరింది. దీంతో తెల్లారే అంటే అక్టోబర్ 16న హనుమకొండలోని మంత్రి సురేఖ ఇంటి వద్ద పోలీస్ పోస్టును, భద్రతా సిబ్బందిని తొలగించడంతో ఏదో జరుగుతుందనే అనుమానాలు రేకెత్తాయి.
Konda Surekha: ఇదే సమయంలో మంత్రి సురేఖ ప్రాతినిధ్యం వహించే దేవాదాయ శాఖ ఫైళ్లన్నీ తనకు పంపాలని ఆ శాఖ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తున్నది. ఇదే సమయంలో మరో విషయం ఉత్కంఠకు తెరలేపింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి మంత్రి కొండా సురేఖకు పిలుపు వచ్చింది.
Konda Surekha: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నుంచి ఆ పిలుపు వచ్చింది. హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ లో భేటీకి రావాల్సిందిగా మంత్రి కొండా సురేఖను ఆమె పిలిచినట్టు తెలిసింది. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశం ఉన్నదని కొందరు ప్రచారం చేస్తున్నారు. లేదా ఆమె నుంచి దేవాదాయ శాఖను మాత్రమే తొలగించి, విభేదాలను పక్కనబెట్టాలని చెప్తారని తెలుస్తున్నది. అసలు ఏం జరుగుతుందోనని కాసేపట్లో తెలిసే అవకాశం ఉన్నది.