PM Kisan yojana:

PM Kisan yojana: పీఎం కిసాన్ ఈసారి వారికి లేన‌ట్టే.. 21వ విడుత ప‌డేది అప్పుడే..

PM Kisan yojana:దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌లు ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌నలో ఈ సారి కొంద‌రికి సాయం క‌ట్ చేయ‌నున్నారు. ఏటా ఎక‌రాకు రూ.6,000 చొప్పున కేంద్ర ప్ర‌భుత్వం రైతుల‌కు న‌గ‌దు సాయాన్ని అంద‌జేస్తున్న‌ది. దానిని మూడు విడ‌త‌లుగా రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లోనే నేరుగా వేస్తున్న‌ది. అయితే ఈసారి 31.01 లక్ష‌ల‌కు పైగా రైతుల‌కు అనుమానాస్ప‌ద ఖాతాల‌ను గుర్తించిన‌ట్టు తెలుస్తున్న‌ది.

PM Kisan yojana:పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న కింద ఒక కుటుంబంలో ఒక‌రికే ఏటా ఎక‌రాకు రూ.6,000ను కేంద్ర ప్ర‌భుత్వం అంద‌జేస్తున్న‌ది. అయితే దేశ‌వ్యాప్తంగా 31.01 లక్ష‌ల‌కు పైగా కుటుంబాల్లో ఒకే కుటుంబంలో ఇద్ద‌రు చొప్పున న‌గ‌దు సాయాన్ని పొందుతున్న‌ట్టు తేలింది. కేంద్ర వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పెద్ద ఎత్తున నిర్వ‌హించిన వెరిఫికేష‌న్ డ్రైవ్ త‌ర్వాత ఈ విష‌యం బ‌య‌ట‌కొచ్చింది.

PM Kisan yojana:కేంద్ర వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెరిఫికేష‌న్ భాగంగా 31.01 లక్ష‌ల‌కు పైగా అనుమానిత కుటుంబాల‌కు గాను, 20ల‌క్ష‌ల మంది ల‌బ్ధిదారుల వెరిఫికేష‌న్ పూర్త‌యింది. వీరిలో సుమారు 18 ల‌క్ష‌ల మంది భార్యాభ‌ర్త‌లు ఉన్న‌ట్టు తేలార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా తెలిసింది. ఈ ప్ర‌క్రియ గ‌డువు కూడా ముగిసింది. అయితే దానిని పొడిగించి మ‌రో మూడు నాలుగు రోజుల్లో ముగించ‌నున్న‌ట్టు స‌మాచారం.

PM Kisan yojana:అయితే ఈ సారి 21వ విడ‌త న‌గ‌దు సాయంగా రూ.2,000ను కేంద్ర ప్ర‌భుత్వం ఎప్పుడు విడుద‌ల చేస్తుంద‌నే విష‌యంలో రైతుల్లో ఉత్కంఠ నెల‌కొన్న‌ది. వెరిఫికేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌యిన త‌ర్వాత, ఇద్ద‌రి చొప్పున వారిని తొల‌గించి, ఉన్న వారికి సాయం అంద‌జేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. వాస్త‌వంగా దీపావ‌ళి సంద‌ర్భంగా రైతుల ఖాతాల్లో ఆర్థిక‌సాయాన్ని వేస్తుంద‌ని తొలుత భావించినా, ఇప్ప‌టి వ‌ర‌కూ కేంద్రం ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. దీంతో కాస్త ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉన్న‌ద‌ని తెలుస్తున్న‌ది. లేదంటే దీపావ‌ళికి ముందే వేసినా ఆశ్చ‌ర్యపోవాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలుస్తున్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *