Sridhar Babu: బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఓటు చోరీ చేసి గెలిచింది

Sridhar Babu: మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటు చోరీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ –> “ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఓటు చోరీ చేసి గెలిచింది. అర్హత లేని విద్యార్థులను ఓటర్లుగా చేర్చి ఎన్నికల్లో గెలుపు సాధించింది. ఈ వ్యవహారంపై మేము అధికారికంగా ఫిర్యాదు చేయనున్నాం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు చాలా ప్రమాదకరం,” అని అన్నారు.

అదే సమయంలో పార్టీ అంతర్గత విషయాలపై స్పందిస్తూ ఆయన స్పష్టం చేశారు –> “మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం చూపేందుకు పీసీసీ, ముఖ్యమంత్రి ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుంది,” అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *