Revanth Reddy

Revanth Reddy: నేడు వరంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (అక్టోబర్ 15) వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

కార్యక్రమం వివరాలు:
సీఎం రేవంత్ రెడ్డి గారు మధ్యాహ్నం సుమారు ఒంటి గంటకు (1:00 PM) హెలికాప్టర్ ద్వారా వరంగల్ చేరుకుంటారు.

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి తల్లి కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి వస్తున్నారు. వడ్డేపల్లిలోని పీజీఆర్ గార్డెన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.

మధ్యాహ్నం 1:15 గంటల నుండి 1:45 గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఉండి, దొంతి మాధవరెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా, వరంగల్ నగరంలో భద్రతా ఏర్పాట్లతో పాటు అన్ని ఏర్పాట్లును అధికారులు పర్యవేక్షించి, సిద్ధం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *