విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ద్వారా వస్తున్న పెట్టుబడి ఏపీకి ఒక మైలురాయిగా లోకేష్ అభివర్ణించారు.
- లక్ష ఉద్యోగాలు: గూగుల్ రాకతో కేవలం డేటా సెంటర్‌లు మాత్రమే కాక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంబంధిత కంపెనీలు కూడా విశాఖకు వస్తున్నాయని, దీని ద్వారా లక్ష మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని లోకేష్ తెలిపారు.
- చర్చలు-ఫలితం: ఈ పెట్టుబడి ఒక రాత్రిలో సాధ్యం కాలేదన్నారు. సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులతో సమావేశమయ్యామని, వారికి డేటా సెంటర్ స్థలాన్ని చూపించామని, నెల రోజుల్లోనే US వెళ్లి గూగుల్ క్లౌడ్ నాయకత్వాన్ని కలిశామని వివరించారు. ఈ అంశంపై సీఎం అనేకసార్లు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించిన తర్వాతే ఇంత పెద్ద పెట్టుబడి సాధ్యమైందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Ravi Naik: గోవా మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ కన్నుమూత
అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం: ప్రాంతాల వారీగా పెట్టుబడులు
“ఒకే రాష్ట్రం… ఒకే రాజధాని… కానీ అభివృద్ధి వికేంద్రీకరణ” (Development Decentralization) తమ లక్ష్యమని లోకేష్ తెలిపారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని, MOUలపై సంతకాలు కాకుండా ఆచరణలో పనులు చేసి చూపిస్తున్నామని లోకేష్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీకి కట్టుబడి ఉన్నామని లోకేష్ పునరుద్ఘాటించారు. కేవలం ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
గత ఐదేళ్ల పాలనపై విమర్శలు చేస్తూ, “గత ఐదేళ్లలో ఏపీలో పెట్టుబడులు కాదు, విధ్వంసం జరిగింది. ఏ ఒక్క కంపెనీ కూడా మన రాష్ట్రం నుంచి వెళ్లే పరిస్థితి రాదు. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి, కానీ ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది” అని లోకేష్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి పనిచేయడం వల్లే రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమైందని ఆయన తెలిపారు.