TSPSC Group 2:టీజీపీఎస్సీ గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్ 18న ప్రభుత్వం నియామకపత్రాలను ఇవ్వనున్నది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆరోజు సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగ నియామకపత్రాలను అందజేయనున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సెలెక్టెడ్ అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడినట్టయింది.
TSPSC Group 2:టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-2 నియామక ప్రక్రియలో 783 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ ఉద్యోగాల కోసం 5,51,855 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో దీనికోసం నిర్వహించిన రాత పరీక్షల్లో 2,49,964 మంది హాజరయ్యారు. 13,315 మంది అభ్యర్థుల ఓఎమ్మార్ పొరపాట్లు, బబ్లింగ్‌లో తప్పుడు సమాధానాలు రాసినందున వారిని అనర్హులుగా ప్రకటించారు.
TSPSC Group 2:వారిలో 2,36,649 మందితో కూడిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను టీజీపీస్సీ ప్రకటించింది. వారిలో ఉద్యోగాలకు ఎంపికైన వారిని ప్రకటించి, 2025 మే 29 నుంచి జూన్ 10 వరకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు. రిజర్వేషన్లు అందుబాటులో ఉన్న పోస్టులను అనుసరించి, ఎంపికైన జాబితాను విడుదల చేశారు. దీంతో 18 రకాల శాఖల్లో 783 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. వారికి 18న నియామక పత్రాలు ఇవ్వనున్నారు. దీంతో ఎంపికైన అభ్యర్థులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.