Ajay Devgan: బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే పాన్ మసాలా, గుట్కా వంటి ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులను ప్రచారం చేసి విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన, ఇప్పుడు ఏకంగా విస్కీ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ చర్యపై ఆయన అభిమానులు, నెటిజన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
అజయ్ దేవగన్ ‘కార్టెన్ బ్రదర్స్’తో కలిసి “ది గ్లెన్ జర్నీస్” (The Glen Journeys) అనే లగ్జరీ సింగిల్ మాల్ట్ విస్కీ బ్రాండ్‌ను భారతదేశంలో విడుదల చేశారు. స్కాటిష్ హైలాండ్స్‌లో తయారైన ఈ విస్కీని దేశంలో హై-ఎండ్ మార్కెట్లో 20 శాతం వాటాను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, హర్యానా, గోవా, చండీగఢ్ వంటి రాష్ట్రాల్లో ఈ బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Also Read: Dil Raju-Salman Khan: సల్మాన్ ఖాన్‌తో దిల్ రాజు భారీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?
అజయ్ దేవగన్ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “ఓవైపు నోటి క్యాన్సర్‌కు కారణమయ్యే ఉత్పత్తులు, మరోవైపు కాలేయ వైఫల్యానికి దారితీసే ఆల్కహాల్ – అజయ్ దేవగన్ సాబ్ ఎక్కడా తేడా చూపడం లేదు” అంటూ ఒక నెటిజన్ వ్యంగ్యంగా స్పందించాడు. “ఇక కేవలం సిగరెట్ బ్రాండ్ మాత్రమే మిగిలింది, దాన్ని కూడా ప్రమోట్ చేస్తే అన్ని అవయవాలనూ కవర్ చేసినట్లే” అని మరొకరు కామెంట్ చేశారు.
అజయ్ దేవగన్ లాంటి పెద్ద స్టార్‌ను లక్షలాది మంది యువత అనుసరిస్తున్నందున, ఆయనకు సామాజిక బాధ్యత ఎక్కువగా ఉండాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. డబ్బు కోసం మనుషుల ప్రాణాలను పణంగా పెట్టడం సరికాదని, ఈ రకమైన ఉత్పత్తుల ప్రచారం తగదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంతో అజయ్ దేవగన్ పరువు మరింత దిగజారిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.