Sabja Seeds: చిన్నగా కనిపించే సబ్జా గింజలు లేదా తులసి గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ గింజలు ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్స్ వంటి పోషకాలు నిండి ఉంటాయి. కానీ వీటిని సరైన రీతిలో తీసుకోవలి.
సబ్జా గింజల్లో ఉండే కరిగే ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. భోజనం తర్వాత చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరగకుండా కాపాడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
Also Read: Cancer: ఒకేఒక రక్త పరీక్షతో 10 ఏళ్లకు ముందే ఒంట్లో క్యాన్సర్ గుర్తింపు
సబ్జా గింజల్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఎముకలను బలపరుస్తాయి. శరీరంలో పోషక లోపాన్ని తీరుస్తాయి. ముఖ్యంగా వృద్ధులలో, మహిళల్లో ఎముకల బలహీనతను నివారించడంలో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునేవారికి సబ్జా గింజలు అద్భుతంగా సహాయపడుతుంది. ఇవి నీటిలో నానిన తర్వాత ఉబ్బి కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. దీంతో అతిగా తినాలనే భావన తగ్గుతుంది. ఇవి తక్కువ కేలరీలతో ఉండడం వల్ల బరువు పెరగకుండా నియంత్రిస్తాయి.
సబ్జా గింజలు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని మంటను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. సీజనల్ వ్యాధులనుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. సబ్జా గింజలను రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, శరీరానికి సమతుల్య పోషకాలు అందుతాయి. సరైన రీతిలో తీసుకుంటే ఇవి సహజంగా హెల్తీ లైఫ్‌స్టైల్‌కు తోడ్పడతాయి.