Abhishek Bachchan

Abhishek Bachchan: ఐశ్వర్య త్యాగాలే నా విజయ రహస్యం: అభిషేక్ బచ్చన్

Abhishek Bachchan: 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక అహ్మదాబాద్‌లో శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఉత్తమ నటుడిగా ఎంపికై అవార్డు అందుకున్నారు. తన అవార్డును స్వీకరించిన తర్వాత అభిషేక్ భావోద్వేగంగా మాట్లాడుతూ, తన విజయానికి వెనుక ఉన్న ప్రధాన కారణం భార్య ఐశ్వర్య రాయ్ బచ్చన్ అని తెలిపారు.

అభిషేక్ మాట్లాడుతూ – “నా 25 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను. కానీ నా పక్కన ఎప్పుడూ నిలిచిన వ్యక్తి ఐశ్వర్య. ఆమె త్యాగాలు, సహనం లేకపోతే నేను ఈ స్థాయికి రాలేకపోయేవాణ్ని. ఈ అవార్డు నిజానికి ఆమెదే” అని అన్నారు. అలాగే కుమార్తె ఆరాధ్య తన జీవితంలో ఆనందం నింపిందని చెప్పారు.

Also Read: Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ 9 కొత్త కంటెస్టెంట్స్ వీలే.. ఇక హౌస్ లో రచ్చ రచ్చే

విడాకుల ఊహాగానాల మధ్య వచ్చిన ఈ వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో అభిషేక్ మాటలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. తన కెరీర్‌లో భాగమైన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “ఈ అవార్డు నా కల. దాన్ని నేడు సాధించడం నా జీవితంలోని మధుర క్షణం” అని తెలిపారు.

అహ్మదాబాద్‌లో జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025 వేడుకను షారుక్ ఖాన్‌, కరణ్ జోహార్‌, మనీష్ పాల్‌లు హోస్ట్ చేశారు. 2024లో విడుదలైన సినిమాలను ఆధారంగా తీసుకొని అవార్డులు ప్రకటించారు. ఈ వేడుకలో ‘లాపతా లేడీస్‌’ చిత్రం 13 విభాగాల్లో అవార్డులు గెలుచుకుని రికార్డ్ సృష్టించింది. ‘కిల్’ మూవీ 6 విభాగాల్లో విజయం సాధించింది. ఉత్తమ నటులుగా అభిషేక్ బచ్చన్ (I Want to Talk), కార్తీక్ ఆర్యన్ (Chandu Champion) అవార్డులు అందుకున్నారు. అలియా భట్ తన ‘జిగ్రా’ సినిమాకుగాను ఉత్తమ నటి పురస్కారం పొందారు. ఇక రవి కిషన్‌, ఛాయా కదమ్‌, నితాన్షీ గోయెల్‌, లక్ష్య‌, రాజ్‌కుమార్ రావ్‌, ప్రతిభ వంటి పలువురు కళాకారులు కూడా తమ తమ విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *