Vivek: నిజామాబాద్‌లో మంత్రి వివేక్ ఆవేశంగా మాట్లాడారు. తనపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు.
వివేక్ మాట్లాడుతూ – “నేను కష్టపడి పనిచేస్తున్నా, నా మీద కుట్రలు చేస్తున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను రెచ్చగొట్టి, నాపై విమర్శలు చేయిస్తున్నారు. లక్ష్మణ్ నాపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో నాకు అర్థంకావడం లేదు,” అన్నారు.
అలాగే ఆయనపై వస్తున్న వదంతులను ఖండిస్తూ – “లక్ష్మణ్ వస్తే నేను వెళ్లిపోతాననడం అబద్ధం. నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు,” అని స్పష్టం చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ “నాది మాల జాతి అని మంత్రి లక్ష్మణ్ విమర్శలు చేయడం బాధాకరం. రాజకీయాల్లో లక్ష్మణ్‌ను ప్రోత్సహించింది మా నాన్నే,” అని వివేక్ తెలిపారు.వివేక్ వ్యాఖ్యలతో స్థానిక రాజకీయాల్లో హల్చల్ చెలరేగింది. ఇద్దరు మంత్రుల మధ్య ఈ మాటల యుద్ధం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.