Cm chandrababu: ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.సిట్‌లో సభ్యులుగా రాహుల్‌దేవ్ వర్మ, మల్లికా గార్గ్, అలాగే ఎక్సైజ్ శాఖ నుంచి మరో ఉన్నతాధికారి ఉన్నారని సీఎం తెలిపారు.
చంద్రబాబు మాట్లాడుతూ –
> “ఆఫ్రికాలో నేర్చుకున్న మోసపూరిత పద్ధతులను ఇక్కడ అమలు చేస్తున్నారు. రాజకీయ ముసుగులో తప్పుడు పనులు సాగుతున్నాయి. ప్రభుత్వం ఏ విధంగానైనా నకిలీ మద్యం ముఠాలను అణచివేస్తుంది” అని హెచ్చరించారు.
ప్రస్తుతం కేసులో 13 మందిని అరెస్ట్ చేశామని, మొత్తం 23 మందిని నిందితులుగా గుర్తించామని ఆయన వెల్లడించారు.సిట్ దర్యాప్తు వేగవంతం చేసి, నకిలీ మద్యం తయారీ, సరఫరా నెట్‌వర్క్‌ను పూర్తిగా బహిర్గతం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.