Helicopter Crash: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఒక ప్రసిద్ధ బీచ్ సమీపంలో ఓ హెలికాప్టర్ అందరూ చూస్తుండగానే కూలిపోయింది . అప్పటి వరకు సాధారణంగా ప్రయాణించిన హెలికాప్టర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి గింగిరాలు తిరిగింది. కాసేపటికే అక్కడున్న చెట్లలో కూలిపోయింది . ఈ ఘటనలో హెలికాప్టర్ లోని ఇద్దరికి, కింద నేలపై ఉన్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) అధికారులు విచారణ ప్రారంభించారు. భద్రతా చర్యల నిమిత్తం ఆ ప్రాంతంలోని రోడ్లను తాత్కాలికంగా మూసివేశారు.
