China: అమెరికా 100 శాతం సుంకాల హెచ్చరికలపై తాము వెనక్కి తగ్గబోమని చైనా సంకేతాలిచ్చింది. బెదిరింపులకు బదులుగా చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించాలని అమెరికాను కోరింది. సుంకాల అంశంలో చైనా వైఖరి స్థిరంగా ఉందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. టారిఫ్ వార్ ను తాము కోరుకోవట్లేదన్న చైనా……ఒక వేళ వచ్చినా భయపడబోమని స్పష్టం చేసింది. అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై ట్రంప్ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ సుంకాలు విధిస్తానంటూ హెచ్చరికలు చేశారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో భేటీని రద్దు చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగారు.
ఇది కూడా చదవండి: Crime News: కూతురిపై అత్యాచారం.. వెంటనే ఇంకొకరితో పెళ్లి.. 13 రోజులకే గర్భం
ఈక్రమంలోనే చైనాదిగుమతులపై అదనంగా మరో 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1 నుంచి ఇవి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాము అమెరికా సుంకాల హెచ్చరికలకు భయపడబోమని చైనా పేర్కొంది. కాగా అరుదైన ఖనిజాల అంశంలో చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్…..బీజింగ్‌పై అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.చైనా దిగుమతులపై 100 శాతం అదనపు సుంకాలు విధించనున్నట్టు ప్రకటించారు. నవంబర్ ఒకటి లేదా అంతకు ముందే సుంకాలు అమల్లోకి వస్తాయని సంకేతాలు ఇచ్చారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి . శుక్రవారం ఒక్కరోజే మదుపర్ల సంపద 1.5 ట్రిలియన్ డాలర్లు ఆవిరైంది.