Rushikonda Buildings

Rushikonda Buildings: విశాఖ రుషికొండ ప్యాలెస్ పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Rushikonda Buildings: విశాఖ రుషికొండ ప్యాలెస్ ను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రుషికొండ భవనాలను అత్యుత్తమ వినియోగ మార్గాలపై ప్రజల సూచనలు, సలహాలను కోరింది. ప్యాలెస్ సహా ఆనుకుని ఉన్న ప్రదేశాన్ని దేనికోసం వినియోగిస్తే బాగుంటుందో తెలియజేయాలని కోరింది. ఈ మేరకు పబ్లిక్ నోటీసు జారీ చేసి వెబ్ సైట్లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ ఆహ్వానాన్ని పొందుపరిచింది. రుషికొండ ప్యాలెస్ పై పర్యాటక ప్రమోషన్, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాలు విధానాలపై పౌరులు అభిప్రాయాలు తెలపాలని సూచించింది. రుషికొండలో పర్యావరణ పర్యాటకం అభివృద్దికి సంబంధించి ఆలోచనలు పంపాలని కోరిన పర్యాటక శాఖ……

ఇది కూడా చదవండి: Andhra King Taluka Teaser: నువ్వు ఒకడివి ఉన్నావని కూడా మీ హీరోకి తెలియదు…!

రుషికొండ ప్యాలెస్ ను సాంస్కృతిక కేంద్రాలుగా మార్చే ప్రతిపాదన సహా ఇతరత్రా ఆలోచనలను తెలియజేయవచ్చని తెలిపింది. పౌరులు తమ సూచనలు, సలహాలను రుషికొండ@ APTDC. IN మెయిల్ అడ్రస్ కు పంపాలని టూరిజం అథారిటీ CEO ఆమ్రపాలి కోరారు. ఇదే సమయంలో ఈ నెల17 న ఉదయం 11 గంటలకు ప్రముఖ జాతీయ,అంతర్జాతీయ స్థాయి సంస్థలతో ఏపీ టూరిజం అథారిటీ విజయవాడ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనుంది. రుషికొండ భవనాల వినియోగంపై సమావేశంలో సంస్థలు అభిప్రాయాలు తెలియజేయవచ్చని స్పష్టం చేసింది. పౌరులు, సంస్థలిచ్చిన అన్ని సూచనలు, సలహాలను మంత్రుల బృందం సమీక్షిస్తుందని, మంత్రుల బృందం సమీక్ష తర్వాత వినియోగించే విధానం పై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమ్రపాలి తెలిపారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *