Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు (ఆదివారం, అక్టోబర్ 12, 2025) సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి రానున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దామోదర్‌రెడ్డి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆయన దశదిన కర్మ కార్యక్రమం నేడు తుంగతుర్తిలో జరగనుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్రంలోని కీలక నాయకులు హాజరుకానున్నారు. ముఖ్యంగా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం సీఎం వెంట తుంగతుర్తి పర్యటనలో పాల్గొననున్నారు.
మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఈ పర్యటనకు వస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో తుంగతుర్తిలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. పోలీస్ బందోబస్తును కూడా కట్టుదిట్టం చేశారు.