Priyanka Mohan: టాలీవుడ్ నటి ప్రియాంక అరుల్ మోహన్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ ఫోటోలపై స్పందించారు. తాను అలాంటి ఫోటోలు ఎప్పుడూ తీయలేదని, అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇమేజెస్ అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఆమె తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.
ఇటీవల AI టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. దీని వల్ల అనేక రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నా, దుర్వినియోగం వల్ల పబ్లిక్ ఫిగర్స్ పెద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓజి సినిమా హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు.
సోషల్ మీడియాలో ఆమె పేరుతో కొన్ని తప్పుడు ఫోటోలు వైరల్ అయ్యాయి. చాలామంది అవి నిజమని భావించి పంచుకోవడంతో ఆ ఫొటోస్ మరింత వైరల్ అయ్యాయి. దీనిపై ప్రియాంక స్పష్టమైన వివరణ ఇచ్చారు. “నా పేరుతో వస్తున్న ఫోటోలు నావి కావు. అవి AI ఇమేజెస్. దయచేసి వాటిని నమ్మవద్దు, షేర్ చేయవద్దు. AIని కేవలం సృజనాత్మక, న్యాయబద్ధమైన ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలి” అని ఆమె పేర్కొన్నారు.
Also Read: Kalki 2898 Part 2: దీపికాను వెనక్కి నెట్టేసిన ఆలియా.. కల్కి 2 సినిమాలో ఛాన్స్..?
ఆమె ఈ పోస్ట్‌తో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అభిమానులు, నెటిజన్లు ప్రియాంకకు మద్దతుగా నిలిచి ఇలాంటి తప్పుడు కంటెంట్‌ను నివారించాలని కోరుతున్నారు. చాలా మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఇలాంటి ఫేక్ AI కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రియాంక మోహన్ యొక్క స్పందనతో AI దుర్వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది. సాంకేతికత మన జీవితాన్ని సులభతరం చేస్తోంది కానీ, దానిని తప్పుడు మార్గంలో వాడితే అది పెద్ద సమస్యలకు దారితీస్తుందని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.