ACB

ACB: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన సబ్ ఇంజనీర్!

ACB: ప్రభుత్వ ఆఫీసుల్లో లంచగొండితనం పెరిగిపోతోంది. ఏసీబీ అధికారులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా, లంచాలు తీసుకునే కొందరు ఆఫీసర్లలో మాత్రం మార్పు రావడం లేదు. వేలల్లో, లక్షల్లో డబ్బులు పుచ్చుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్నారు.

తార్నాకలో సబ్ ఇంజనీర్ అరెస్ట్
తాజాగా, హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న టీఎస్‌పీడీసీఎల్ ఆఫీసులో ఒక సబ్ ఇంజనీర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అతని పేరు సుధాకర్ రెడ్డి.

రూ. 15,000 డిమాండ్
వివరాల్లోకి వెళ్తే… కొత్త ట్రాన్స్‌ఫార్మర్ పెట్టించే పని కోసం ఒక కాంట్రాక్టర్ టీఎస్‌పీడీసీఎల్ ఆఫీసుకు వెళ్ళాడు. అయితే, సబ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి ఆ పని చేసిపెట్టడానికి ఆ కాంట్రాక్టర్ వద్ద రూ. 15,000 లంచంగా డిమాండ్ చేశాడు.

ఏసీబీకి ఫిర్యాదు
లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆ కాంట్రాక్టర్ వెంటనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, సబ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డిపై నిఘా పెట్టారు.

లంచం తీసుకుంటున్న సమయంలోనే ఏసీబీ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆఫీసులో కలకలం రేగింది.

లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే! ఇలాంటి అవినీతి అధికారుల గురించి ఎవరికైనా తెలిస్తే, వెంటనే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *