Richa Ghosh

Richa Ghosh: రిచా ఘోష్ సెంచరీ వృధా… టీమిండియా ఓటమి

Richa Ghosh: మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో, భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ (Richa Ghosh) అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగింది. భారత జట్టు ఒక దశలో 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట సమయంలో రిచా ఘోష్ క్రీజులోకి వచ్చి జట్టును ఆదుకుంది. ఆమె కేవలం 77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 94 పరుగులు చేసింది. దురదృష్టవశాత్తూ సెంచరీని తృటిలో కోల్పోయింది. రిచా ఘోష్ వీరోచిత పోరాటం మరియు స్నేహ్ రాణా (33) తో కలిసి నెలకొల్పిన కీలక భాగస్వామ్యం (8వ వికెట్‌కు 88 పరుగులు) కారణంగా, భారత జట్టు నిర్ణీత 49.5 ఓవర్లలో 251 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో రిచా ఘోష్ 8వ స్థానంలో బ్యాటింగ్ చేసి, ఈ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. అయితే, ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. దక్షిణాఫ్రికా తరఫున మారిజ్న్ కాప్ 45 పరుగులకు 2, నాడిన్ డి క్లెర్క్ 55 పరుగులకు 2, మ్లాబా 46 పరుగులకు 2, క్లోయ్ లెస్లీ ట్రయాన్ 32 పరుగులకు 3 వికెట్లు తీసుకున్నారు.

Also Read: IND vs WI: వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

రెండు జట్ల ప్లేయింగ్ XI
భారత మహిళల జట్టు (ప్లేయింగ్ XI): ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, స్నేహ రాణా, క్రాంతి గౌడ్
దక్షిణాఫ్రికా మహిళల జట్టు (ప్లేయింగ్ XI) : లారా వోల్‌వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, సునే లూస్, మారిజన్ కాప్, అన్నేకే బాష్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా జాకా, తుమీ సెఖుఖునే, నంకులులే
ప్రకటన.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *