TDP Failure In Medical Colleges

TDP Failure In Medical Colleges: ఇప్పుడు ఎంత అడ్డుకుంటే జగన్‌కు అంత మైలేజ్‌..

TDP Failure In Medical Colleges: గతంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలనే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కూడా పునరావృతం చేస్తోందా? ఇది అధికార గర్వమా లేక వైసీపీకి ఎదురొడ్డేందుకు అనుసరిస్తున్న వ్యూహమా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. కానీ, జగన్ విషయంలో టీడీపీ పొరపాట్లు చేస్తూ వాటినే అలవాటుగా మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. జగన్ రాజకీయ శైలిని పరిశీలిస్తే, ఆయన ప్రజల్లోకి వచ్చే సందర్భాలు చాలా తక్కువ. చంద్రబాబు లాగా రోజూ సభలు, సమావేశాల్లో పాల్గొనే స్వభావం ఆయనది కాదు. ఇటీవల నెల్లూరు పర్యటన తర్వాత చాలా గ్యాప్ తీసుకుని, ఆ తర్వాతే విశాఖ పర్యటనకు సిద్ధమయ్యారు. జగన్ పర్యటన ప్రకటన వెలువడగానే టీడీపీ నాయకులు ఎందుకో ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఆయనపై విమర్శలు గుప్పించడం, మీడియా ముందు జగన్ గురించే మాట్లాడటం మొదలుపెట్టారు. విపక్ష నేతగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పర్యటనలపై పోలీసులు కూడా అనవసర ఆంక్షలు విధిస్తున్నారేమో అనిపిస్తుంది. మొదట అనుమతి లేదని, తర్వాత ఆంక్షలతో అనుమతి ఇస్తామని, వాహనాల సంఖ్య, జనం సంఖ్యపై రకరకాల నిబంధనలు విధించారు. ఇలాంటి ఆంక్షలు నిజంగా అవసరమా? ఒక నాయకుడి పర్యటనలో జనం వెంట రావడం సహజం. వారిని అడ్డుకోవడం వల్ల లాభం ఏమీ లేకపోగా, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని కూటమి నాయకులు ఆలోచించాలి కదా? అంటున్నారు అనలిస్టులు.

Also Read: PM Modi: ట్రంప్ కు ప్రధాని మోదీ అభినందనలు.. ఎందుకంటే

ఇక జగన్ నర్సీపట్నం పర్యటన సందర్భంగా.. గతంలో మరణించిన డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి, జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అలాగే, “జగన్ గో బ్యాక్” అంటూ మహిళలు, దళిత సంఘాలు ప్లే కార్డులతో నిరసనకు దిగారు. కూటమి వీటిని రాజకీయ వ్యూహాలు భావిస్తూ ఉండొచ్చు కానీ తటస్థంగా గమనించే ప్రజలకు ఇలాంటి చర్యలు జగన్‌కు ఇంకా బలం ఉందని, అందుకే కూటమి భయపడుతోందని అనిపించేలా చేస్తున్నాయి. జగన్ పర్యటనలను వైసీపీ కంటే ఎక్కువగా కూటమి నాయకులే హైప్ చేస్తూ ప్రచారం చేస్తున్నారని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

వాయిస్ – 3వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఇటువంటి తప్పిదాల వల్లే వైసీపీ ఈ రోజు 11 సీట్లకు పరిమితమై విపక్షంలో ఉందన్న వాస్తవాన్ని మరచిపోతే ఎలా? గతంలో వైసీపీ చేసిన తప్పులనే ఇప్పుడు కూటమి కూడా చేస్తోందని, ఆంక్షలతో జగన్ పర్యటనలను అడ్డుకోవడం వల్ల ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా, జగన్ విశాఖ పర్యటన విషయంలో వైసీపీ నాయకుల కంటే టీడీపీ నాయకుల ఆందోళన, ఆరాటం ఎక్కువగా కనిపించింది. ఇటువంటి చర్యలు కూటమికే బూమరాంగ్‌గా మారుతాయని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *