Bihar Assembly Elections: నవంబర్ లో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార, విపక్ష కూటమిలు…… సీట్ల పంపకాలపై చర్చలు కొనసాగిస్తున్నాయి. అధికారంలో ఉన్న BJP, JDU సమానంగా సీట్లు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 243 స్థానాల్లో ఇతర పక్షాలకు కేటాయించగా మిగిలిన సీట్లను చెరిసగం పంచుకోవాలని . యోచిస్తున్నట్టు తెలుస్తోంది. NDAకూటమిలో చిరాగ్ పాసవాన్ ఆధ్వర్యంలోని లోక్ జనశక్తి పార్టీ LJPకి..బీజేపీ 25 సీట్లు ప్రతిపాదించగా జీతన్ రామ్ మాంఝీకి చెందిన H.A.Mకి 7, ఉపేంద్ర కుశ్వాహా నేతృత్వంలోని R.L.Mకి ఆరు సీట్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా పాసవాన్ తో..
ఇది కూడా చదవండి: ED Raids: దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ ఇళ్లపై ఈడీ దాడులు
చర్చలు జరుగుతున్నాయని, ఆయన వాటాకు వెళ్లే స్థానాల సంఖ్య పెరిగితే, మాంఝీ-కుశ్వాహాకు కేటాయించే సీట్ల సంఖ్యలో కోతపడే అవకాశం ఉందని కూటమి వర్గాలు వెల్లడించాయి. అటు విపక్ష మహాగఠ్ బంధన్ కూటమిలో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ కు 54 సీట్లు ఇవ్వడానికి RJD అంగీకరించగా.. హస్తం పార్టీ మరో 10 సీట్లు డిమాండ్ చేస్తుంది. R.J.D చేసిన.. 19 సీట్ల ప్రతిపాదనను తిరస్కరించిన CPI 30 సీట్లు కావాలని పట్టుబడుతోంది. ముఖేష్ సాహ్ని V.I.Pకి 12 సీట్లను R.J.D ప్రతిపాదించగా 20 కంటే ఎక్కువ సీట్లతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. R.J.D…… దాదాపు 140 సీట్లలో పోటీ చేయాలని భావిస్తుంది. అదే జరిగితే మిత్రపక్షాల మధ్య కొన్నిచోట్ల స్నేహపూర్వక పోటీ జరిగే అవకాశం ఉంది.