YCP Social Media War

YCP Social Media War: వైసీపీ ఏ యుద్ధం చేయాలనుకుని, ఏ యుద్ధం చేస్తోంది?

YCP Social Media War: సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ స్ప్రెడ్‌ చేస్తున్న ఈ డీప్‌ ఫేక్‌ వీడియోని ఓ సారి చూడండి. తర్వాత మాట్లాడుకుందాం….

ఇదొక్కటే కాదు.. ఇలాంటివి లెక్కలేనన్ని క్రియేషన్స్‌. ఇలా వైసీపీ సోషల్ మీడియా స్ట్రాటజీ ఇటీవలి కాలంలో తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. పార్టీ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, యూట్యూబ్, ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో వందలాది అకౌంట్లను నిర్వహిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ అకౌంట్లకు లక్షల మంది ఫాలోయర్లు మరియు సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వీటి ద్వారా ఫేక్, ఏఐ-జనరేటెడ్ మరియు డీప్‌ఫేక్ కంటెంట్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సమయంలో వైసీపీలో ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పడింది. అప్పుడు ఒక్కో పోస్ట్ షేర్‌కు 5 రూపాయలు పేటీఎమ్ ద్వారా చెల్లించే విధానం అమలులో ఉండేది. దీని కోసం పార్టీ ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను సైతం సృష్టించింది అప్పట్లో. పీకే వైదొలిగిన తర్వాత, ఈ స్ట్రాటజీ మరింత తీవ్రమైన రూపు దాల్చింది. ఫేక్‌ కంటెంట్‌ నేరుగా పార్టీ నుండే వస్తున్నట్లు ఆరోపణలున్నాయి. స్వయంగా వైసీపీ అఫీషియల్‌ హ్యాండిల్స్‌లోనూ తరచూ ఇలాంటి ఫేక్‌ కంటెంట్‌ పోస్ట్‌ చేయడం అందుకు ఉదాహరణ. గ్రాఫిక్ పర్సన్‌, డిజైనర్లు, ఇతర టెక్నీషియన్లను రిక్రూట్ చేసుకుంటూ, వీరికి వివిధ మార్గాల ద్వారా పరోక్షంగా చెల్లింపులు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

Also Read: Telangana: కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పార్టీల సోషల్ మీడియా వ్యవస్థలను పరిశీలిస్తే, వైసీపీకి ఇతర పార్టీలకు మధ్య స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి. జనసేన సోషల్‌మీడియా దాదాపుగా అన్‌ ఆర్గనైజ్డ్ వ్యవస్థ. ఫ్యాన్స్ స్వచ్ఛందంగా పాల్గొంటారు, పార్టీ నియంత్రణ సాధ్యం కాదు. టీడీపీ సోషల్‌మీడియా ఒకరకంగా ఆర్గనైజ్డ్ వ్యవస్థ అని చెప్పాలి. ఫ్యాన్స్ స్వచ్ఛందంగా పని చేస్తారు, కానీ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. పార్టీ నియంత్రణ కొంత ఉంటుంది. కానీ వైసీపీది మాత్రం పూర్తిగా ఆర్గనైజ్డ్ అండ్‌ పెయిడ్ వ్యవస్థలా కనిపిస్తుంది. వందల కోట్ల ఖర్చుతో నిర్వహిస్తూ, ఫేక్ కంటెంట్‌ను ప్రధానంగా ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

ఇటీవలి పరిణామాలు, ఫేక్ ప్రచారాలు చూస్తుంటే… వైసీపీ నాయకత్వం తమ క్యాడర్‌ను మరోసారి తమ స్వార్థానికి బలి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సోషల్ మీడియా రిక్రూట్మెంట్లు భారీగా పెరిగాయంటున్నారు. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన కొందరిని కూడా జీతానికి నియమించుకున్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది. దుబాయ్ వంటి ప్రాంతాలకు కొందరిని పంపి, అక్కడి నుంచి పోస్టులు చేయిస్తున్నారట. ఈ ప్రభావంతోనే ఇటీవలి రోజుల్లో వైసీపీ సోషల్ మీడియా కార్యకలాపాలు తీవ్రమయ్యాయి, ఫేక్ వీడియోలు, బూతు ప్రచారాలు పెరిగాయని టాక్‌ నడుస్తోంది. ఇలాంటి స్ట్రాటజీలు దీర్ఘకాలంలో పార్టీకి, క్యాడర్‌కు కూడా ప్రమాదమే కాగా.. సమాజానికి అత్యంత హానికరం. మరి ఏపీ ప్రభత్వం కొత్తగా తేవాలనుకుంటున్న సోషల్‌మీడియా ప్రత్యేక చట్టం అయినా ఈ ఫేక్‌ని అరికడుతుందేమో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *