Mahesh Kumar goud: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్‌తో

Mahesh Kumar goud: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తమతోనే ఉంటుందని, తమ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

“మజ్లిస్ మా ఫ్రెండ్లీ పార్టీ, ఎన్నికల్లో మేము కలసి పటిష్టమైన ప్రదర్శన ఇవ్వగలం” అని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పా

కాంటోన్మెంట్‌ మాదిరే జూబ్లీహిల్స్ లో విజయం

కాంటోన్మెంట్ ఉప ఎన్నికల విజయం తరహాలో జూబ్లీహిల్స్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధిస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టిక్కెట్ బీసీలకు ఇవ్వబడే అవకాశం ఉందని వెల్లడించారు. రెండు-మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.

 

స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై కూడా ఆయన చెప్పారు: పరిస్థితిని బట్టి మిత్రపక్షాల అభ్యర్థులకు కూడా టిక్కెట్లు ఇవ్వబడతాయి. సీపీఎం, సీపీఐ, తెలంగాణ జనసమితి అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వే అవకాశం ఉందని స్పష్టం చేశారు.-

పార్టీ పదవులు భర్తీ, బీసీ రిజర్వేషన్లు, బహిరంగ సభలు డిసెంబర్ చివరి నాటికి పార్టీ పదవులన్నింటిని భర్తీ చేస్తామని ప్రకటించారు.

 

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును ముందే ఊహించేవాళ్లమని అన్నారు.త్వరలో కామారెడ్డిలో బహిరంగ సభ కూడా జరుగనుందని తెలిపారు.

 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *