Jubilee Hills By Elections: బిహార్ అసెంబ్లీ సాధారణ ఎన్నికల ప్రకటనతో పాటు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం (EC) విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌లో తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక తేదీని కూడా ప్రకటించారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వివరాలు కింద విధంగా ఉన్నాయి:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. కేవలం మూడు రోజుల తర్వాత, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.
ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 13న విడుదల కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. జూబ్లీహిల్స్‌లో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.