Anjankumar Yadav:

Anjankumar Yadav: మంత్రి పొన్నంపై అంజ‌న్‌కుమార్ యాద‌వ్ ఆగ్ర‌హం.. కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ చిచ్చు

Anjankumar Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతున్న‌ది. టికెట్ విష‌యంలో గ్రూప్ త‌గాదాల‌కు దారి తీస్తున్న‌ది. ఎవ‌రికి వారు య‌మునా తీరే అన్న‌ట్టుగా పోస్టర్లు వేసుకుంటున్నారు. ప్ర‌చారం చేసుకుంటున్నారు. దీంతో ఎవ‌రికి టికెట్ ఇవ్వాలో అన్న విష‌యంపై ఆపార్టీ అధిష్టానం ఎటూ నిర్ణ‌యం తీసుకోలేక త‌ల‌ప‌ట్టుకున్న‌ది. ఈ ద‌శ‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత అయిన అంజ‌న్‌కుమార్ యాద‌వ్ సీటుపై ప‌ట్టువ‌ద‌ల‌డం లేదు.

Anjankumar Yadav: తాజాగా ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌పై టికెట్ అంశంపై అంజ‌న్‌కుమార్ యాద‌వ్‌పై విరుచుకుప‌డ్డారు. పొన్నం ప్ర‌భాక‌ర్ కంటే తానే కాంగ్రెస్‌లో సీనియ‌ర్‌న‌ని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ టికెట్‌ను పొన్నం ప్ర‌భాక‌ర్ నిర్ణ‌యించ‌డ‌ని, పార్టీ అధిష్టాన‌మే నిర్ణ‌యిస్తుంద‌ని తేల్చి చెప్పారు. అంత‌ర్గ‌తంగా త‌న‌పై వ‌స్తున్న అభ్యంత‌రాల‌పై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

Anjankumar Yadav: కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎంతో మంది ఉన్నార‌ని అంజ‌న్‌కుమార్ యాద‌వ్ వివ‌రించారు. ఉత్త‌మ్‌కుమార్‌రెడ‌డ్ఇ మంత్రిగా ఉంటే, ఆయ‌న భార్య ఉత్త‌మ్ ప‌ద్మావ‌తి ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నార‌ని, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మంత్రి అయితే ఆయ‌న సోద‌రుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నార‌ని చెప్పారు.

Anjankumar Yadav: అదే విధంగా మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క డిప్యూటీ సీఎం అయితే, ఆయ‌న సోద‌రుడు మ‌ల్లు ర‌వి ఎంపీ అని, వివేక్ వెంక‌ట‌స్వామి మంత్రి అయితే ఆయ‌న కొడుకు ఎంపీ అని, సోద‌రుడు ఎమ్మెల్యే అని గుర్తు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నార‌ని చెప్పారు. త‌న కొడుకు ఎంపీ అయితే త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వ‌రు.. అని అంజ‌న్‌కుమార్ యాద‌వ్‌ ప్ర‌శ్నించారు.

Anjankumar Yadav: గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రాధాన్యాల‌ను కూడా అంజ‌న్ కుమార్ యాద‌వ్ ప్ర‌స్తావించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో బీఆర్ఎస్ పార్టీ బ‌లంగా ఉండాల‌ని మ‌హమూద్ అలీకి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి డిప్యూటీ సీఎంను చేశార‌ని, నాయిని న‌ర్సింహారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి హోం మినిస్ట‌ర్‌ను చేశార‌ని అంజ‌న్‌కుమార్ యాద‌వ్ ఇదే సంద‌ర్భంగా గుర్తుచేశారు. దీన్నిబ‌ట్టి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ విష‌యంలో ఆయ‌న ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని దీంతో తేలిపోయింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *