IND vs WI

IND vs WI: సెంచరీ తో చరిత్ర సృష్టించిన జడేజా.. దెబ్బకు కపిల్‌ దేవ్‌, ధోని రికార్డులు బ్రేక్‌

IND vs WI: టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జడ్డూ.. కచ్చితమైన ఆటతీరుతో హాఫ్ సెంచరీ బాదాడు. ధ్రువ్ జురెల్‌తో కీలక భాగస్వామ్యం నిర్మించి జట్టును ముందుకు నడిపించాడు. ప్రస్తుతం 59 పరుగుల వద్ద ఆడుతున్న జడేజా, టెస్టుల్లో ఇది తన 28వ అర్ధ శతకం కావడం విశేషం.

ఏడో ఫిఫ్టీ – తొమ్మిది ఇన్నింగ్స్‌లలో

జడేజా గత తొమ్మిది ఇన్నింగ్స్‌లలో ఏడోసారి ఫిఫ్టీ బాదడం అతని స్థిరత్వాన్ని సూచిస్తోంది. అంతకుముందు ఇంగ్లండ్ పర్యటనలో కూడా తన బ్యాటింగ్‌తో మెప్పించిన జడేజా, మాంచెస్టర్‌లో సెంచరీ సాధించాడు. 2025లో ఇప్పటి వరకు టెస్టుల్లో అతని సగటు 75కు పైగా ఉండటం అతని అద్భుత ఫామ్‌కు నిదర్శనం. ఈ ఏడాది 605 పరుగులు సాధించాడు. వ‌రల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్‌లో ఇప్పటివరకు 45 మ్యాచ్‌లు ఆడి 2451 పరుగులు చేసిన జడ్డూ, నాలుగు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

కపిల్ దేవ్ రికార్డు బ్రేక్

ఈ మ్యాచ్‌లో అర్ధశతకం పూర్తి చేసిన జడేజా మరో అరుదైన రికార్డును సాధించాడు. టెస్టుల్లో ఐదు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన నాలుగో భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు 28 హాఫ్ సెంచరీలు చేసిన జడేజా, 27తో ఉన్న కపిల్ దేవ్ రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో వీవీఎస్ లక్ష్మణ్ (40) అగ్రస్థానంలో ఉండగా, ధోని (32), సౌరవ్ గంగూలీ (29) తరువాతి స్థానాల్లో ఉన్నారు.

ఇది కూడా చదవండి: Akshay Kumar: నా కుమార్తెను నగ్న ఫోటోలు పంపమని కోరాడు

సిక్సర్లలో ధోనిని దాటిన జడేజా

బ్యాటింగ్‌లో సత్తా చాటిన జడేజా సిక్సర్ల పరంపరలోనూ కొత్త రికార్డు సాధించాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో ధోనిని అధిగమించాడు. ధోని తన కెరీర్‌లో 78 సిక్సర్లు బాదగా, జడేజా ఇప్పటివరకు 79 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో సెహ్వాగ్ (90), రిషబ్ పంత్ (90) అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు.

టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు

  • రిషబ్ పంత్ – 47 మ్యాచ్‌ల్లో 90 సిక్సర్లు

  • వీరేంద్ర సెహ్వాగ్ – 103 మ్యాచ్‌ల్లో 90 సిక్సర్లు

  • రోహిత్ శర్మ – 67 మ్యాచ్‌ల్లో 88 సిక్సర్లు

  • రవీంద్ర జడేజా – 86 మ్యాచ్‌ల్లో 79 సిక్సర్లు

  • ఎంఎస్ ధోని – 90 మ్యాచ్‌ల్లో 78 సిక్సర్లు

👉 సౌరాష్ట్ర స్టార్ జడేజా ఫామ్‌ను బట్టి చూస్తే.. రాబోయే టెస్టుల్లో ఇంకా ఎన్నో రికార్డులు తన పేరిట నమోదు చేసుకోవడం ఖాయమే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *