Kantara Chapter 1: సినిమా అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ దసరా పండుగను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న విడుదలైంది. విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమాకు హిట్ టాక్ లభించింది. దీంతో థియేటర్లలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతూ, హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
‘కాంతార చాప్టర్ 1’ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మొదటి రోజు షోలు దాదాపు అన్ని చోట్లా హౌస్‌ఫుల్ అయ్యాయి. గతంలో వచ్చిన ‘కాంతార’ సినిమాకు తెలుగు ప్రేక్షకులు అద్భుతమైన ఆదరణ ఇవ్వడంతో, ఇప్పుడు దాని ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రానికి కూడా అదే స్థాయిలో స్పందన లభించింది. నిర్మాతలు తెలుగు రాష్ట్రాల పంపిణీదారులతో కలిసి భారీ విడుదలకు ఏర్పాట్లు చేయడంతో తొలిరోజు రికార్డు స్థాయి వసూళ్లు వచ్చినట్టు సమాచారం.
Also Read: Rahul Ramakrishna: గాంధీ మహాత్ముడే కాడు.. కేటీఆర్, కేసీఆర్ మళ్ళీ రావాలి.. చివరికి అకౌంట్ డిలీట్
రిషబ్ శెట్టి దర్శకత్వం, ఆయన అద్భుతమైన నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ సినిమాలోని కథాంశం సాంస్కృతిక అంశాలతో ముడిపడి ఉండటంతో పాటు, విజువల్ ట్రీట్‌గా నిలిచింది. కథలోని భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాకుండా, సినిమా సాంకేతిక విలువలు, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. రిషబ్ శెట్టి తన విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల్లో జోష్ నింపుతూ, వారి మనసులను గెలుచుకున్నాడు.