Sana Mir

Sana Mir: దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు.. పాక్ మాజీ క్రికెటర్

Sana Mir: మాజీ పాకిస్థాన్ కెప్టెన్, ప్రస్తుత కామెంటేటర్ సనా మీర్, మహిళల ODI ప్రపంచ కప్ 2025లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా చేసిన ‘ఆజాద్ కాశ్మీర్’ వ్యాఖ్యపై వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీశాయి.

పాకిస్థాన్ బ్యాటర్ నతాలియా పర్వేజ్ గురించి కామెంటరీ ఇస్తున్నప్పుడు, ఆమె స్వస్థలాన్ని గురించి మాట్లాడుతూ సనా మీర్ ముందుగా “కశ్మీర్” అని, ఆ తర్వాత సరిదిద్దుకుంటూ “ఆజాద్ కశ్మీర్” అని పేర్కొన్నారు. పాకిస్థాన్ ఈ ప్రాంతాన్ని ‘ఆజాద్ జమ్మూ అండ్ కశ్మీర్’ అని పిలుస్తుంది, అయితే భారతదేశం దీన్ని పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) గా పరిగణిస్తుంది. దీంతో, క్రీడా వేదికపై రాజకీయాలు కలపడంపై ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో, సనా మీర్ సోషల్ మీడియా ద్వారా సుదీర్ఘ వివరణ ఇస్తూ, తన మాటలను అనవసరంగా పెంచేస్తున్నారని పేర్కొన్నారు.

Also Read: World Cup 2025: మహిళల వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్‌ ఘోర ఓటమి!

కమెంటేటర్లుగా మేము ఆటగాళ్లు ఎక్కడి నుంచి వచ్చారు అనే అంశంపై కథ చెప్పే ప్రక్రియలో భాగంగానే ఆ వ్యాఖ్య చేశాను. ఒక ఆటగాడు ఆ ప్రాంతం నుంచి రావడానికి ఎదుర్కొన్న సవాళ్లు మరియు ఆమె అద్భుతమైన ప్రయాణాన్ని హైలైట్ చేయడమే నా ఉద్దేశం అని ఆమె తెలిపారు. దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు. ప్రపంచ వేదికపై కామెంటేటర్‌గా, మేము క్రీడ, జట్లు, ఆటగాళ్లపై మాత్రమే దృష్టి సారించాలి. పట్టుదల, ధైర్యం యొక్క స్ఫూర్తిదాయకమైన కథలను హైలైట్ చేయాలి” అని ఆమె విజ్ఞప్తి చేశారు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *