Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ మొదటివారంలో భారత పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. భారత్ -రష్యా మధ్య జరిగే వార్షిక ద్వైపాక్షిక సమావేశాల్లో ఆయన పాల్గొంటారని సమాచారం. అయితే పుతిన్ పర్యటనకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. డిసెంబర్ 5-6 తేదీల్లో ఆయన భారత్ కు రానున్నట్లు సమాచారం. ఆగస్టులో జాతీయ భద్రత సలహాదారు అజిల్ ఢోబాల్ రష్యా పర్యటన సందర్భంగా…..పుతిన్ భారత పర్యటనపై చర్చ జరిగింది. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ -రష్యా వార్షిక ద్వైపాక్షిక సదస్సు కీలకంగా నిలుస్తోంది. 2000సంవత్సరం నుంచి ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతుండగా…..కొవిడ్ కారణంగా రెండేళ్లు ఈ సమావేశాలు వాయిదాపడ్డాయి.
