Dimple Hayathi: టాలీవుడ్ నటి డింపుల్ హయాతి మరో వివాదంలో చిక్కుకున్నది. గతంలో పోలీస్ అధికారితో వివాదంతో రచ్చకెక్కిన ఆమె.. తాజాగా ఇంటి పనిమనుషుల విషయంలో మరో వివాదాన్ని కొనితెచ్చుకున్నది. గతంలో పోలీస్ అధికారితో తానొక్కతే వివాదం పెట్టుకోగా, ఈసారి తన భర్తను కూడా మరో వివాదంలోకి లాగింది. ఇది తీవ్రమైన నేరంగా పలువురు పరిగణిస్తున్నారు. దీనిపై పోలీస్ కేసు నమోదైంది.
Dimple Hayathi: డింపుల్ హయతి తన ఇంటిలోని కుక్కలను చూసుకోవడానికి ఇద్దరు పని మనుషులను ఒడిశా నుంచి రప్పించుకున్నది. తన ఇంటిలో ఆ ఇద్దరు పనిమనుషులతో పనులు చేయించుకున్నది. వారికి డబ్బులు ఇవ్వకుండా వేధించసాగింది. వారు తమ కుటుంబం అవసరాల కోసం డబ్బులు ఇవ్వాలని ఎంతగా బతిమిలాడినా ఇవ్వకుండా ఇంటి నుంచి వారిద్దరినీ బయటకు వెళ్లగొట్టింది.
Dimple Hayathi: వారిని ఇంటి నుంచి వెళ్లగొట్టేప్పుడు ఆ ఇద్దరు పని మనుషులపై నటి హయతి రెచ్చిపోయి మాట్లాడిందని బాధితులు తెలిపారు. మీరు నా చెప్పుల ఖరీదు చేయలేరని, మీరెంత, మీ బతుకెంత అంటూ దౌర్జన్యం ప్రదర్శించారని బాధిత మహిళలు తెలిపారు. నా భర్త లాయర్ అని, మీరు నన్ను ఏమీ చేయలేరు.. అంటూ వారిపై బెదిరింపులకు దిగారని ఆరోపించారు.
Dimple Hayathi: ఈ మేరకు తమకు జరిగిన అన్యాయంపై ఆ పనిమనుషులు.. డింపుల్ హయతితోపాటు ఆమె భర్తపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తమతో పనులు చేయించుకొని డబ్బులు ఇవ్వలేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతోపాటు తమ నగ్న వీడియోలు తీసేందుకు వారిద్దరూ యత్నించారని, తాము అంగీకరించకపోతే హయతి, ఆమె భర్త తమను చిత్రహింసలకు గురిచేశారని బాధిత మహిళలు ఆరోపించారు.