Delhi: ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చలు జరిపారు.
చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి అంశాలను ముందుకు తెచ్చి, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ప్రగతిపై వివరాలు అందించారు. అలాగే అమరావతి నిర్మాణ పనుల పురోగతిని కూడా అమిత్ షాకు వివరించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గురించి ఆయన విపులంగా వివరించారు.
ఈ సమావేశం ద్వారా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు కేంద్ర స్థాయిలో మరోసారి చర్చకు వచ్చినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.