Bihar Voter List 2025: బీహార్‌లో వివాదాస్పదంగా సాగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ అనంతరం తుది ఓటర్ల జాబితాను భారత ఎన్నికల కమిషన్ (ECI) మంగళవారం ప్రకటించింది. ఈ జాబితా ఆధారంగానే రాబోయే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
65 లక్షల మందికి పైగా పేర్లు తొలగింపు
సర్ ప్రక్రియకు ముందు బీహార్‌లో 7.89 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే, సమీక్ష తర్వాత ఈ సంఖ్య 7.24 కోట్లకు తగ్గింది. అంటే సుమారు 65.63 లక్షల మంది పేర్లు ఓటర్ లిస్టులో నుంచి తొలగించబడ్డాయి. నకిలీ, డూప్లికేట్ ఓటర్లను తొలగించడమే ప్రధాన ఉద్దేశ్యమని ఈసీ స్పష్టం చేసింది.
ప్రతిపక్షాల విమర్శలు
అయితే, ఈసీ చర్యలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కలిసి ‘‘ఓటర్ అధికార్ యాత్ర’’ చేపట్టారు. ఈసీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, ప్రత్యేకంగా ముస్లింలను టార్గెట్ చేస్తూ పేర్లు తొలగించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ప్రక్రియను ‘‘ఓటు దొంగతనం’’గా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: October 1 New Rules: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. యూపీఐ నుంచి NPS, PF వరకు రాబోయే అతిపెద్ద మార్పులివే.. ఫుల్ డిటెయిల్స్..!
సుప్రీంకోర్టు హెచ్చరిక
సర్ ప్రక్రియపై వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. కమిషన్ నిర్వహణలో అవకతవకలు జరిగితే, ఓటర్ల జాబితాను రద్దు చేయడానికైనా వెనకాడబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఎన్నికల షెడ్యూల్‌పై అంచనాలు
బీహార్ అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం నవంబర్ 22తో ముగియనుంది. తుది ఓటర్ల జాబితా విడుదలైనందున, ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్ 6 లేదా 7న ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.