Meenakshi Chaudhary

Meenakshi Chaudhary: ఫోర్స్ 3లో మీనాక్షి చౌదరి యాక్షన్ అవతారం!

Meenakshi Chaudhary: బాలీవుడ్ యాక్షన్ స్టార్ జాన్ అబ్రహం నటిస్తున్న ‘ఫోర్స్ 3’ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ చిత్రం ఫ్రాంచైజీలో మూడో భాగం. డైరెక్టర్ భవ్ ధులియా దర్శకత్వంలో రూపొందుతోంది. మీనాక్షి తెలుగు, తమిళ సినిమాల్లో హిట్ పాత్రలు చేసి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో మొదటి పెద్ద అవకాశం వచ్చింది.

Also Read: The Paradise: కత్తులు, గన్ ల మధ్య మోహన్ బాబు.. ‘ది ప్యారడైజ్‌’ పవర్ ఫుల్ లుక్ రిలీజ్

ఈ సినిమాలో మీనాక్షి ప్రధాన పాత్రలో యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకోనుంది . జాన్ అబ్రహంతో సమానంగా ఆమె కూడా హై-ఆక్టేన్ ఫైట్ సన్నివేశాల్లో కనిపిస్తారు. ఈ రోల్ కోసం ఆమె ప్రత్యేక శిక్షణ పొందనున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. నవంబర్ 2025 నుంచి షూటింగ్ మొదలవుతుంది. జాన్ తన రాకేష్ మారియా బయోపిక్ పూర్తి చేసి ఈ చిత్రంపై దృష్టి పెడతారు. 2026 విడుదల కానుంది. ఈ చిత్రం ఫోర్స్ సిరీస్‌కు సాఫ్ట్ రీబూట్. కొత్త కథాంశంతో యాక్షన్, థ్రిల్లర్ మిక్స్ అవుతుంది. మీనాక్షి చౌదరి తెలుగు సినిమాల్లో వరుస హిట్‌లు ఇచ్చారు. ‘హిట్ 2’, ‘లక్కీ భాస్కర్’లో మంచి పాత్రలు చేశారు. ఇప్పుడు మూడో భాగం ఫోర్స్ 3 పాన్-ఇండియా రేంజ్‌లో వస్తోంది. ఈ చిత్రం మీనాక్షి బాలీవుడ్‌లో మొదటి పెద్ద స్టెప్. ఆమె యాక్షన్ అవతారం అభిమానులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *