Komatireddy Raj Gopal Reddy: కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వాడి తగ్గడం లేదు. ప్రభుత్వంపై తన గళాన్ని విప్పుతూనే ఉన్నారు. ప్రజలే తనకు ముఖ్యమని, పదవులు తర్వాతేనని చెప్తున్న మాటలను తాజాగా కూడా కుండబద్దలు కొట్టినట్టుగా తేల్చి చెప్పేశారు. తన నియోజకవర్గ ప్రజల కోసం ఎంతదాకా అయినా వెనుకాడనని పునరుద్ఘాటించారు.
Komatireddy Raj Gopal Reddy: ఈసారి ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ అంశపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బడాబాబుల భూములను కాపాడేందుకే ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ను మార్చారని సొంత ప్రభుత్వంపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ కంపెనీలు, బడాబాబుల కోసమే అలైన్ మార్చారని భూ నిర్వాసితులు చేస్తున్న ఆరోపణలు వాస్తవమేనని ఒప్పుకున్నారు.
Komatireddy Raj Gopal Reddy: ప్రభుత్వంతో కొట్లాడి అయినా ట్రిపుల్ ఆర్ బాధిత రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి హామీ ఇచ్చారు. అవసరమైతే ప్రభుత్వాన్నే మార్చేద్దామంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ను మార్చకపోతే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్నే మార్చేద్దామని రైతులకు ఆయన భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.
Komatireddy Raj Gopal Reddy: గత కొంతకాలంగా సొంత ప్రభుత్వంపై విమర్శల బాణాలను ఎక్కుపెడుతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఈసారి ఏకంగా ప్రభుత్వాన్నే మార్చేద్దామంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మంత్రి పదవి దక్కలేదని రాజగోపాల్రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న దానిపై స్పందించారు. తనకు పదవులు ముఖ్యం కాదని, తానంటే గిట్టనివారే ఇలాంటివి పుట్టిస్తున్నారని తెలిపారు.