Congress Party: మదర్ డెయిరీ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేల్లో రచ్చకు తెరతీసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి ఓ ఎమ్మెల్యే పాటుపడుతున్నాడని మరో ఎమ్మెల్యే ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణల పర్వం దూషణల వరకూ దారితీసింది. ఇది ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మధ్య భగ్గుమనే స్థాయికి చేరింది. తాజాగా బీర్ల అయిలయ్యపై మందుల సామేలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Congress Party: ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సంచలన ఆరోపణలు చేశారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో మా ప్రాంత నాయకులు కొందరు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని, మీ బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని బొంద పెట్ట వద్దని హెచ్చరించారు. లఫంగి రాజకీయాలు మానుకోవాలని, రాజకీయ వ్యభిచారం చేయవద్దని బీర్ల అయిలయ్యను మందుల సామేలు హెచ్చరించారు.
Congress Party: మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నైతికంగా బాధ్యత వహిస్తూ బీర్ల అయిలయ్య తన పదవికి రాజీనామా చేయాలని మందుల సామేలు డిమాండ్ చేశారు. ప్రలోభాలకు గురికాకుండా ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. అయిలయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజకీయ వ్యభిచారం చేస్తే మంచిదని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలతో నల్లగొండ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల దూషణలు తీవ్ర స్థాయికి చేరడంపై క్యాడర్లో అయోమయం నెలకొన్నది.