Harish Rao

Harish Rao: “ఇది ప్రజాస్వామ్యమా? కాళ్లు కట్టేసి లాఠీలతో కొడతారా?”

Harish Rao: నల్గొండ జిల్లాలో జరిగిన ఒక సంఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. యూరియా కోసం ఆందోళన చేసిన ఒక గిరిజన యువకుడిపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పట్ల దమనకాండకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

పోలీసుల తీరుపై హరీశ్ రావు ఫైర్
“ప్రజా పాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోంది. యూరియా అడిగినందుకు ఒక గిరిజన యువకుడిని కులం పేరుతో దూషించి, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కాళ్లు కట్టేసి లాఠీలతో కొట్టడం ఎంతవరకు సమంజసం?” అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఇది రేవంత్ రెడ్డి పాలనలో అరాచకానికి పరాకాష్ట అని ఆయన విమర్శించారు.

ప్రశ్నిస్తే దాడులు, కేసులు
“ప్రశ్నిస్తే దాడులు, నిలదీస్తే కేసులు, అక్రమ అరెస్టులు… కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇదే కనిపిస్తోంది” అని హరీశ్ రావు అన్నారు. 22 నెలలుగా పాలనను గాలికి వదిలేసి, దౌర్జన్యాలే కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. లాఠీ దెబ్బలకు నడవలేని స్థితిలో ఉన్న ఆ యువకుడి భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

విచారణకు డిమాండ్
గిరిజన యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై వెంటనే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని ఆయన కోరారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *