Junior: యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘జూనియర్’ థియేటర్లలో మిశ్రమ స్పందన పొందినప్పటికీ, ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 30, 2025 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించే అంశాలతో నిండిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
‘జూనియర్’ సినిమా :
రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి నిర్మించిన ‘జూనియర్’ ఒక రొమాంటిక్ కామెడీ డ్రామా. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి ఈ చిత్రంతో హీరోగా డెబ్యూ చేశారు. స్టార్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్గా నటించగా, బాలీవుడ్ నటి జెనీలియా డిసౌజా కీలక పాత్రలో కనిపించి, సౌత్ సినిమాల్లో తిరిగి రీ-ఎంట్రీ ఇచ్చింది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. రావు రమేశ్, రవిచంద్ర, సుధారాణి, సత్య, హర్ష చెముడు వంటి నటులు సపోర్టింగ్ రోల్స్‌లో నటించారు.
Also Read: OG: ఓజి కోసం మిరాయ్ నిర్మాత సంచలన నిర్ణయం!
సినిమా కథ యువతను ఆకర్షించే రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నిండి ఉంది. కిరీటి రెడ్డి తన తొలి చిత్రంలోనే సహజమైన నటన, డాన్స్‌లతో ఆకట్టుకున్నారు. శ్రీలీల తన ఎనర్జీ, డాన్స్‌తో సినిమాకు గ్లామర్ జోడించగా, జెనీలియా పాత్ర అభిమానులను సంతోషపరిచింది. ‘వైరల్ వయ్యారి’ పాట సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టించి, యూత్‌లో హైప్‌ను పెంచింది. ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆహా ప్లాట్ఫామ్లో సెప్టెంబర్ 30, 2025 నుంచి స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులకు ఇంట్లో సౌకర్యవంతంగా చూసే అవకాశం లభిస్తుంది. దసరా సెలవుల సమయంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం వల్ల కుటుంబ ప్రేక్షకులు, యూత్ నుంచి మంచి వ్యూవర్షిప్ రావొచ్చని టీమ్ ఆశిస్తోంది.