Wife Demands: బెంగళూరులో ఒక వింతైన కుటుంబ వివాదం వెలుగులోకి వచ్చింది. పెళ్లి అయిన మూడునెలలకే భార్య, భర్తల మధ్య చిన్న విభేదం పెద్ద కక్ష్యగా మారి ఇప్పుడు పోలీసుల దాకా చేరింది. తొలి రాత్రి నుంచి శారీరక సంబంధం జరగలేదన్న కారణంతో భార్య తన భర్త వద్ద ఏకంగా రూ.2 కోట్లు పరిహారం డిమాండ్ చేసిందని భర్త ఆరోపణలు చేస్తున్నారు.
చిక్కమగళూరుకు చెందిన ప్రవీణ్ కె.ఎం. ఈ ఏడాది మే 5న చందనను వివాహం చేసుకున్నారు. వివాహానంతరం వీరిద్దరూ బెంగళూరులోని సప్తగిరి ప్యాలెస్‌లో నివాసం ఉండటం ప్రారంభించారు. అయితే తొలి రాత్రి ప్రవీణ్ మానసిక ఒత్తిడి కారణంగా వెనకడుగు వేయడంతో చందన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తర్వాత వైద్య పరీక్షలు చేయించుకున్నప్పటికీ, డాక్టర్లు ప్రవీణ్ శారీరకంగా సక్రమంగానే ఉన్నారని, కానీ కొంత విశ్రాంతి అవసరమని సూచించారు.
పరిహారం డిమాండ్.. కుటుంబ కలహాలు
మూడు నెలలు గడిచిన ఇంకా టైం కావాలి అనడంతో విసుగెత్తిన భార్య తనకు రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిందని ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, ఆగస్టు 17న చందన బంధువులు గుంపుగా అతని గోవిందరాజ్ నగర్ ఇంట్లోకి చొరబడి, ప్రవీణ్ మరియు అతని కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై స్పందించిన పవన్..
పెద్దల పంచాయితీ కూడా ఫలించలేదు
ఇంతలో జూన్ 5న చందన బంధువులు 15–20మంది వరకు గుమికూడి ఇంట్లో పంచాయితీ నిర్వహించారని, అందులోనూ రూ.2 కోట్ల విలువైన ఆస్తిని వధువుకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారని ప్రవీణ్ ఆరోపించారు. సమస్య పరిష్కారం కాలేదని, పైగా తనపై దాడులు, బెదిరింపులు ఎక్కువయ్యాయని చెప్పారు.
పోలీసులు కేసు నమోదు
ఆగస్టు 17న ఆలయం నుంచి తిరిగి వచ్చిన సమయంలో మరోసారి దాడి జరిగిందని ప్రవీణ్ తన ఫిర్యాదులో వివరించారు. సీసీటీవీ ఫుటేజ్, వైద్య నివేదికలను సాక్ష్యాలుగా సమర్పించారు. ప్రస్తుతం చందనతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.