Fatima Sana

Fatima Sana: పాక్‌ ఆటగాళ్లది మళ్లీ అదే తీరు.. ఈసారి మహిళా క్రికెట్‌లో

Fatima Sana: పాకిస్థాన్ క్రికెటర్లు ప్లాన్ ప్రకారమే కవ్వింపులకు పాల్పడుతున్నారు. భారత్ చేతిలో ఎదురైన పరాజయాన్ని జీర్ణించుకోలేక.. అసత్య విషయాలను నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆసియా కప్‌ 2025లో భాగంగా భారత్‌తో జరిగిన సూపర్-4 మ్యచ్‌లో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ 6-0 అంటూ సైగలు చేశాడు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ ప్రయోగించిన 6 రఫేల్ జెట్లను కూల్చామనే విషయాన్ని తెలియజేసేలా సంజ్ఞలు చేశాడు. ఇక ఇటీవల భారత్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత నష్రా సంధు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో ఆమె తన ఆరు వేళ్లను చూపిస్తున్నట్లుగా ఫోటోను షేర్ చేసింది.

ఇది పాకిస్తాన్‌లోని క్రికెట్ అభిమానులలో చర్చకు దారితీసింది. భారత్‌కు కౌంటర్‌గా ఆమె ఇలా చేసిందని, టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు ప్రదర్శనను ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించిందని కొందరు భావించారు. లాహోర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో నశ్రా సంధు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో ఆమె కేవలం 26 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టింది. ఇది ఆమె కెరీర్‌లో అత్యుత్తమ వన్డే గణాంకంగా నిలిచింది. అంతేకాకుండా, అదే మ్యాచ్‌లో ఆమె తన 100వ వన్డే వికెట్‌ను కూడా సాధించి, తన కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది.

ఇది కూడా చదవండి: Bangladesh Head Coach: క్రికెట్‌లో ఏ జట్టుకైనా భారత్‌ను ఓడించే సత్తా ఉంది

నవంబర్ 2023లో ఐసీసీ మహిళా టీ20ఐ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నశ్రా సంధు తన కెరీర్‌లో అత్యుత్తమంగా 5వ స్థానానికి చేరుకుంది. ఈ ర్యాంకు ఆమె స్థిరమైన ప్రదర్శనకు నిదర్శనం.నశ్రా సంధు ఒక ఎడమచేతి వాటం స్లో ఆర్థడాక్స్ బౌలర్. ఆమె తన బౌలింగ్‌తో పాకిస్తాన్ జట్టులో కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో 2017లో ఒక మ్యాచ్ తర్వాత ఎయిర్‌పోర్టు నుండి బైక్‌పై వెళ్ళిన వీడియో కూడా వైరల్ కావడంతో ఆమె వార్తల్లో నిలిచింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *