Lokesh OG Pawan DSC

Lokesh OG Pawan DSC: సెప్టెంబర్‌ 25.. కూటమిలో రెండు పండుగలు..!

Lokesh OG Pawan DSC: ఏపీలో కూటమి ఫ్యాన్స్‌కు ఈ సెప్టెంబర్‌ 25 స్పెషల్ డే గా మారనుంది. ఒకవైపు ఓజీ రిలీజ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లు మోత మోగనున్నాయి. మరోవైపు అమరావతిలో మెగా డీఎస్సీ మెగా ఈవెంట్‌ సంచలనం కాబోతోంది. మెగా డీఎస్సీ సభకు ఏర్పాట్లు చూస్తుంటేనే మతి పోతోంది. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. మెగా డీఎస్సీ సభకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అతిథిగా రావాలని స్వయంగా మంత్రి లోకేష్‌ వెళ్లి ఆహ్వానించడం, దీంతో 25న జరిగే మెగా డీఎస్సీ సభలో చంద్రబాబు, పవన్‌, లోకేష్‌లు ఒకే వేదికపై కనిపించనుండటం.. కూటమి పార్టీల కార్యకర్తలు, అభిమానులకు కన్నుల పండుగ కానుంది.

అయితే కూటమిలో చీలిక తెచ్చేందుకు గత 15 నెలలుగా వైసీపీ సోషల్‌మీడియా చేయని ప్రయత్నాలు అంటూ లేవు. లోకేష్‌కి డిప్యూటీ సీఎం పదవి అంశం నుంచి మొదలు పెడితే నిన్న మొన్న అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వివాదం వరకూ… పవన్‌ కళ్యాణ్‌పై ఏదో కుట్ర జరుగుతోందని, దాని వెనుక లోకేష్‌ ఉన్నాడని ఏవేవో కథనాలు వండి వార్చి, అనుమానాలు రేకెత్తించి, జనసైనికులను రెచ్చగొట్టాలని చూసిన ప్రతిసారీ కూడా… పవన్‌-లోకేష్‌ల మెచ్చూర్‌ పాలిటిక్స్‌, వారి మధ్య బలమైన బాండింగ్… ఆ కుట్రలను బద్ధలు కొడుతూనే వస్తోంది. అలా లోకేష్, పవన్ ల జోడీ వైసీపీ ఆశల్ని సమాధి చేస్తోంది అంటున్నారు విశ్లేషకులు.

Also Read: Trump: ట్రంప్‌ ఎక్కగానే ఆగిపోయిన ఎస్కలేటర్‌.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైట్‌ హౌజ్‌

సెప్టెంబర్ 25న జరిగే మెగా డీఎస్సీ కార్యక్రమంలో సుమారు 16 వేల మంది డీఎస్సీ విజేతలకు టీచర్‌ నియామక పత్రాలు అందజేయనున్నారు. అమరావతిలో నేషనల్‌ హైవేకి సమీపంలో నిర్వహిస్తున్న సభకు గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవలే జరగాల్సిన ఈ కార్యక్రమం వర్షాల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కలిసి వచ్చిన అదనపు సమయాన్ని వినియోగించుకుని సభ దద్దరిల్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకొక ఎంట్రెన్స్‌ చొప్పున, అధికారులు, ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రి కలుపుకుని ప్రత్యేకంగా 17 ఎంట్రెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సందర్భంగా, లోకేష్ స్వయంగా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఛాంబర్‌కు వెళ్లి, ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ఆహ్వానించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కేవలం ఆహ్వానంలా కాకుండా.. ఇద్దరి మధ్య బలమైన సోదర బంధానికి నిదర్శనంగా నిలిచింది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్‌కు ఈ మెగా డీఎస్సీ వేడుక అతిపెద్ద విజయం. అదే విధంగా అదే రోజు పవన్‌ కళ్యాణ్‌ ఓజీ సినిమా రిలీజ్‌ అయ్యి, పవర్‌ స్టార్‌ సినీ కెరీర్‌లో గత రికార్డులను తిరగరాయనుంది. అంటే లోకేష్‌ విజయంలో పవన్‌ భాగస్వామ్యం అవుతోంటే.. పవన్‌ సక్సెస్‌లో లోకేష్‌ పాలు పంచుకోబోతున్నారనమాట. ఇలా చంద్రబాబు నాయకత్వంలో, పవన్-లోకేష్‌ల స్నేహం మహావృక్షంలా ఎదిగి, వైసీపీ రాజకీయ కలలను సమాధి చేస్తోంది అనడంలో సందేహం లేదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *