Aadhaar Service Charges: UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) అక్టోబర్ 1 నుండి ఆధార్ అప్డేషన్ సర్వీస్ ఛార్జీలను పెంచింది. ఈ నిర్ణయం ప్రజలకు స్వల్ప భారం కలిగించినప్పటికీ, సేవల నాణ్యతను పెంచడం, సాంకేతిక వసతులను విస్తరించడం ఈ మార్పు వెనుక ప్రధాన ఉద్దేశమని UIDAI తెలిపింది.
డెమోగ్రాఫిక్ అప్డేట్ (పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నంబర్): ఇంతకు ముందు రూ.50 ఉన్న ఈ ఛార్జీని ఇప్పుడు రూ.75కి పెంచారు. ఇందులో పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ అప్డేట్ (వేలిముద్రలు, ఐరిస్, ఫోటో): ఈ అప్డేట్కు ఛార్జీ రూ.100గా ఉంది. ఇందులో వేలిముద్రలు, ఐరిస్ స్కానింగ్, ఫోటోగ్రాఫ్ వంటి బయోమెట్రిక్ వివరాలు ఉంటాయి.
ఇది కూడా చదవండి: PAK vs SL: ఆసియా కప్ 2025.. పాక్ ఫైనల్ ఆశలు సజీవం
బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ అప్డేట్ రెండూ ఒకేసారి: రెండు రకాల అప్డేట్లను ఒకేసారి చేసినా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
డాక్యుమెంట్ అప్డేట్ (ఆన్లైన్లో): myAadhaar పోర్టల్ ద్వారా చిరునామా, గుర్తింపు పత్రాలను అప్డేట్ చేసుకునేందుకు ఛార్జీ రూ.50గా ఉంటుంది. ఇంతకు ముందు కొన్ని సందర్భాల్లో ఇది ఉచితంగా ఉండేది. అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చిన ఈ కొత్త రేట్లు ఆధార్ కేంద్రాలలో చేసే అప్డేట్లకు వర్తిస్తాయి.
UIDAI ఇప్పటికీ కొంతమందికి ఉచిత ఆధార్ అప్డేట్ సౌకర్యం కల్పిస్తోంది. ముఖ్యంగా పదేళ్ల క్రితం ఆధార్ పొంది, ఎటువంటి అప్డేట్ చేసుకోనివారు ఆన్లైన్లో తమ చిరునామా, గుర్తింపు పత్రాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఉచిత సేవ నిర్ణీత కాలపరిమితి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.