Viral News:ఇదేమిటి? ఒకేచోట రామచిలుకలు వరుసగా వాలినట్టు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎందుకు ఏర్పాటు చేశారు? ఏ రక్షణ కోసం, ఎవరి సంరక్షణ కోసం? అని మీకు అనుమానం కలిగింది కదూ.. నిజమేనండీ.. అటుగా వెళ్లే ప్రతి ఒక్కరికీ ఇదే విచిత్రం గోచరిస్తుంది. రోడ్డుపై ఓ స్తంభంపై ఒకేచోట ఏర్పాటు చేసిన వింత గొలిపేలా ఉన్న ఈ సీసీ కెమెరాలను చూసిన ప్రతిఒక్కరూ ఆశ్చర్యంగా చూసి, వాటి గురించి తెలుసుకొని వెళ్తుంటారు.
Viral News:ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 40 సీసీ కెమెరాలు ఒకేచోట ఉండటం నిజంగా ప్రత్యేకత ఏమీ లేదు కానీ, వాటి గురించి తెలుసుకోవాల్సిందే. ఈ సీసీ కెమెరాలు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని వివేకానంద సెంటర్ నుంచి పీఎస్సార్ సెంటర్కు వెళ్లే దారిలో ఓ వ్యాపారి వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
Viral News:సీసీ కెమెరాలు అమర్చే వ్యాపారి కావడంతో, అందరికీ తన వ్యాపారం గురించి తెలియాలనే ఉద్దేశంతో తన దుకాణం ఎదుట ఇలా ఓ స్తంభం ఏర్పాటు చేసి, 40 సీసీ కెమెరాలను ఇలా ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. చూపరులను ఆకట్టుకునేలా ఉండే ఈ కెమెరాలు పాడైపోయినవేనన్న మాట. వ్యాపారం అభివృద్ధి ఏమో కానీ, ఆలోచన మాత్రం విభిన్నంగా ఉన్నదని పదుగురు మెచ్చుకుంటున్నారు.