Singareni Bonus: దసరా పండుగను పురస్కరించుకుని సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం భారీ బోనస్ ప్రకటించింది. సంస్థ లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు పంచాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వారు ఈ శుభవార్తను వెల్లడించారు.
ప్రతి కార్మికుడికి రూ.1,95,610 బోనస్
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి రెగ్యులర్ కార్మికుడికి రూ.1,95,610 బోనస్‌గా లభించనుంది. దీనివల్ల వేలాది మంది కార్మికులకు మేలు జరుగుతుంది.
కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్: దేశ చరిత్రలో తొలిసారి
సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ ప్రకటించారు. ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి రూ.5,500 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నిర్ణయంతో 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. దేశ చరిత్రలోనే కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం ఇదే తొలిసారని భట్టి పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.