GST 2.0

New GST: అమల్లోకి కొత్త జీఎస్టీ.. తగ్గిన ధరలు

New GST: దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ ధరలు అమల్లోకి వచ్చాయి. ఇకపై 5%, 18% శ్లాబులు మాత్రమే ఉంటాయి. కొన్ని లగ్జరీ వస్తువులను 40% లిస్టులో చేర్చారు. ఆహారం, పాల ఉత్పత్తులు, FMCG, ఎలక్ట్రానిక్స్, వాహనాలతో పాటు సుమారుగా 200కు పైగా వస్తువుల ధరలు తగ్గాయి. ఇక దసరా సీజన్ కూడా మొదలవ్వడంతో కంపెనీలు మరింత ధరలు తగ్గించే అవకాశముంది. దీంతో షోరూమ్స్‌లో కొనుగోలుదారులతో సందడి నెలకొననుంది. టీవీలపై జీఎస్టీ శ్లాబు మార్పుతో పలు కంపెనీలు రూ.85వేల వరకు ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. నేటి నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. LG గరిష్ఠంగా టీవీల ధరలను రూ.85వేల వరకు తగ్గించినట్లు తెలిపింది. సోనీలో రూ.70వేల వరకు, పానాసోనిక్‌లోనూ మోడల్‌ను బట్టి రూ.7వేల వరకు తగ్గించినట్లు వెల్లడించాయి.

ఇది కూడా చదవండి: Narendra Modi: GST 2.0 తో ₹ 2.5 లక్షల కోట్ల పొదుపు..!

టూవీలర్స్‌లో రూ.18వేలు, కార్ల ధరలను రూ.4.48 లక్షల వరకు తగ్గించినట్లు ఆయా కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. జీఎస్టీ సంస్కరణలతో ధరలు తగ్గని వస్తువులు కూడా ఉన్నాయి. హానికర వస్తువులు 40 శాతం పన్ను పరిధిలోకి వస్తాయని జీఎస్టీ మండలి ఇప్పటికే ప్రకటించింది. దీని ప్రకారం.. పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్‌, పాన్‌ మసాలా వంటి వస్తువుల ధరలు మరింత పెరగనున్నాయి. వీటితోపాటు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గేమింగ్‌ ప్లాట్‌ఫారాలకు పన్ను పెరగనుంది. ఇక పెట్రోలియం ఉత్పత్తులు ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో లేనందున వాటి ధరల్లో ఎటువంటి మార్పు ఉండబోదు. వజ్రాలు, ప్రెషియస్‌ స్టోన్స్‌ వంటి లగ్జరీ వస్తువుల రేట్లు కూడా అలాగే కొనసాగనున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *