Navaratri 2025

Navaratri 2025: ఈరోజు నుంచి దసరా నవరాత్రులు మొదలు, తొమ్మది రోజులు 9 రూపాలు.. ఏ రోజు ఏ పువ్వులు సమర్పించాలో తెలుసుకోండి!

Navaratri 2025: దసరా నవరాత్రులు ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి.  నేటి నుండి తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించడం ఆనవాయితీ. ప్రతి రోజూ అమ్మవారి వేర్వేరు రూపాలను ఆరాధిస్తారు. పురాణాల ప్రకారం ఒక్కో దేవతకు ఒక్కో పువ్వు అంటే ఎంతో ఇష్టం. ఆ రోజుకు తగిన పూలను సమర్పించడం వలన శుభఫలితాలు, శాంతి, విజయాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం.

ఇప్పుడు ఈ తొమ్మిది రోజులలో అమ్మవారికి ఏ పూలు సమర్పించాలో చూద్దాం:

మొదటి రోజు – శైలపుత్రి
తెల్లటి పూలు లేదా తెల్ల కమలాలు సమర్పించాలి. ఇవి జీవితంలో శాంతి, స్థిరత్వాన్ని ప్రసాదిస్తాయి.

రెండవ రోజు – బ్రహ్మచారిణి
మల్లెపూలు, గులాబీలు సమర్పించాలి. ఇవి భక్తిని పెంచి, ఏకాగ్రతను బలపరుస్తాయి.

మూడవ రోజు – చంద్రఘంట
బంతి పూలు సమర్పించడం శత్రువులపై విజయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.

నాలుగవ రోజు – కూష్మాండ
ఎర్రమందారాలు సమర్పించాలి. ఇవి ఆరోగ్యం, దీర్ఘాయువు, తేజస్సును ప్రసాదిస్తాయి.

ఇది కూడా చదవండి: Horoscope Today: ఈ రాశి వారికి డబ్బులే డబ్బులు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

ఐదవ రోజు – స్కందమాత
కమల పువ్వులు సమర్పించాలి. వీటి ద్వారా శ్రేయస్సు, సౌభాగ్యం లభిస్తాయి.

ఆరవ రోజు – కాత్యాయని
కదంబ పూలు సమర్పించడం వైవాహిక జీవితంలో ఆనందం, సఖ్యతను ఇస్తుంది.

ఏడవ రోజు – కాళరాత్రి
మల్లెపూలు లేదా నీలం కృష్ణతామర పూలు సమర్పించాలి. ఇవి భయాన్ని తొలగిస్తాయి.

ఎనిమిదవ రోజు – మహాగౌరి
తెల్లటి పూలు, గులాబీలు సమర్పించడం ఆనందం, సంతృప్తిని ప్రసాదిస్తుంది.

తొమ్మిదవ రోజు – సిద్ధిదాత్రి
నీలి కమలాలు, మల్లెపూలు సమర్పించాలి. ఇవి విజయాన్ని, సమృద్ధిని కలిగిస్తాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *